రేపు ములుగు జిల్లాలో వైయస్ షర్మిల పోడు యాత్ర

by  |
YS Sharmila
X

దిశ, ములుగు: పోడు భూముల పరిష్కారం, పోడు రైతులకు భరోసా ఇవ్వడానికి వైయస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల బుధవారం ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. పోడు భూములకై పోరు కార్యక్రమంలో భాగంగా వైయస్ షర్మిల ములుగు జిల్లా కేంద్రంలో ఉద‌యం 11 గంట‌ల‌కు అంబేద్కర్ విగ్రహానికి పూల‌మాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంత‌రం గోవిందరావుపేట మండలం ప‌స్రా గ్రామంలో కుమురం భీం విగ్రహానికి నివాళి అర్పించి, అనంతరం అక్కడి నుంచి తాడ్వాయి మండలంలో లింగాల గ్రామం వ‌ర‌కు భారీ ర్యాలీ చేప‌ట్టనున్నారు. అనంతరం లింగాల‌ గ్రామంలో పోడుభూములకై పోరు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైయస్‌ఆర్ టీపీ నాయకులు తెలిపారు.

Next Story