కేసీఆర్‌కు రైతుల గోస కనిపించట్లేదా.. షర్మిల ఆగ్రహం

by Shyam |
కేసీఆర్‌కు రైతుల గోస కనిపించట్లేదా.. షర్మిల ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తనకంటే పెద్ద రైతు లేడని ప్రగల్భాలు పలికిన సీఎం కేసీఆర్‌కు చిన్న రైతుల గోసలు కనపించడం లేదా అని వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం సమయానికి కొనుగోలు చేయకపోవడం వల్ల ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిచి వారు గగ్గోలు పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను కనీసం పలకరించేందుకైనా సీఎం కేసీఆర్‌కు ఫామ్ హౌస్ నుంచి బయటికి వచ్చే తీరిక లేకుండా పోయిందని ఆమె ఎద్దేవా చేశారు. రైతులు అవస్థ పడుతుంటే.. సారు ప్రతీకార రాజకీయాలతో సంబురాలు చేసుకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు. రైతు వ్యతిరేకి కేసీఆర్ గారు.. కనీసం రైతులను పరామర్శించడానికైనా బయటికి రండి అంటూ వైఎస్ షర్మిల చురకలంటించారు.

Advertisement

Next Story

Most Viewed