షర్మిల కొత్త పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారు

by Shyam |   ( Updated:2021-03-16 07:02:51.0  )
షర్మిల కొత్త పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారు
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త పార్టీ ప్రకటనపై వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ 9న కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు ఖమ్మం జిల్లా నేతలతో నిర్వహించిన సమావేశంలో షర్మిల వెల్లడించారు. లక్షమంది కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో పార్టీ ప్రకటన చేస్తానన్నారు. తాను ఎవరూ వదిలిన బాణం కాదని, తాను టీఆర్‌ఎస్‌కో.. లేక బీజేపీకో.. బీ టీమ్ కాదని షర్మిల వ్యాఖ్యానించారు.

తెలంగాణలో సమస్యల పరిష్కారానికే పార్టీ ఏర్పాటు చేశానని, ఖమ్మం వేదికగానే సమరశంఖం పూరిద్దామని షర్మిల అభిమానులకు తెలిపారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయాలని షర్మిలను అభిమానులు కోరగా.. పోటీ గురించి తర్వాత ఆలోచిద్దామని షర్మిల స్పష్టం చేశారు.

Advertisement

Next Story