- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా మాటెత్తితే.. డబ్బులు కట్!
దిశ, వెబ్‌డెస్క్:
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే చైనాలో ఈ వైరస్ బారిన పడి 3,042 మంది చనిపోయారు. దాదాపు 90వేల మందికి వైరస్ ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ టాపిక్ ఇప్పుడు యూట్యూబ్ క్రియేటర్లకు కాసులు కురిపిస్తోంది. ఎలాగూ జనాల నోట్లో నానుతున్న పదం కాబట్టి కరోనా వైరస్ మీద ఏదో ఒక వీడియో చేసేసి, డబ్బులు వెనకేసుకుందామని మీడియం రేంజ్ యూట్యూబర్లు ప్రయత్నిస్తున్నారు.
అయితే తప్పుడు వార్తలు నియంత్రించే క్రమంలో భాగంగా కరోనా వార్తలను యూట్యూబ్ నిలిపివేయాలనుకుంది. అయితే తప్పుడు వార్తలను ఇంత తక్కువ సమయంలో ఫిల్టర్ చేయడం కష్టం కాబట్టి, కరోనా పేరుతో వచ్చే వీడియోలన్నింటికీ డబ్బులు చెల్లించబోమని యూట్యూబ్ ప్రకటించింది. ఈ వీడియోలను డీమానిటైజ్ చేస్తున్నట్లు యూట్యూబ్ ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ టామ్ లియాంగ్ తెలిపారు. కోవిడ్ 19 వైరస్ టాపిక్ చాలా సున్నితమైనది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు టామ్ అన్నారు.
Tags: COVID 19, Corona, Virus, Youtube, Demonitize