సెల్‌ఫోన్‌కు డబ్బులివ్వలేదని యువకుడు ఆత్మహత్య

దిశ, జనగామ: సెల్‌ఫోన్‌ కొనడానికి తల్లిదండ్రులు సరిపడా డబ్బులివ్వలేదని ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పాలకుర్తి మండలంలో చోటు చేసుకుంది. రాఘవపురం గ్రామానికి చెందిన కూస సోమయ్య, శోభ దంపతులకు ఇద్దరు కుమారులు, చిన్న కుమారుడు కూస శ్రీకాంత్ (20) డిగ్రీ చదువుతున్నాడు. కొద్ది రోజులుగా తనకు సెల్‌ఫోన్‌ కొనివ్వాలంటూ ఇంట్లో గొడవ చేస్తున్నాడు. దీంతో సోమవారం తండ్రి అతనికి రూ. 8 వేలు ఇచ్చాడు. మరో మూడు ఇవ్వాలని పట్టిబట్టిన శ్రీకాంత్ రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే బంధువులు 108 కు సమాచారం అందించి మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

Advertisement