బాయ్‌ఫ్రెండ్‌ను బలవంత పెట్టి.. రూ.41 లక్షల జాక్‌పాట్ కొట్టిన మహిళ

by Disha Web Desk 17 |
బాయ్‌ఫ్రెండ్‌ను బలవంత పెట్టి.. రూ.41 లక్షల జాక్‌పాట్ కొట్టిన మహిళ
X

దిశ, నేషనల్ బ్యూరో: మేరీల్యాండ్‌కు చెందిన ఒక మహిళకు జాక్‌పాట్ తగిలింది. లాటరీలో దాదాపు $50,000 (రూ. 41,66,977) గెల్చుకుంది. ఇటీవల బ్రెన్ అనే మహిళ తన బాయ్‌ఫ్రెండ్‌ను వీస్ మార్కెట్స్‌లో $10 క్విక్-పిక్ లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేయమని బలవంత పెట్టింది. దీంతో అతను లాటరీని కొనుగోలు చేసి ఆ మహిళకు ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె దానిని పర్సులో పెట్టుకుని తరుచూ చెక్ చేసుకునేది. తాజాగా ఇంటికి వెళ్లి లాటరీ యాప్‌ని ఉపయోగించి స్కాన్ చేసి చూడగా ఆమె కొనుగోలు చేసిన టిక్కెట్‌కే $50,000 బహుమతి లభించింది. నేను నిజంగా ఇది నమ్మలేక పోయి గట్టిగా అరిచాను, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే భారీ మొత్తాన్ని గెలుచుకుంటానని ఎప్పుడూ అనుకోలేదని ఆ మహిళ పేర్కొంది. బ్రెన్ తన డబ్బును ఎలా ఖర్చు చేస్తుందో ఖచ్చితంగా పేర్కొనలేదు, అయితే ట్రక్కును కొనుగోలు చేసి తన వ్యాపారంలో మరింత పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉందని అన్నారు. యుఎస్‌లో భారీ మొత్తంలో గెలిచుకోవడం ఇది మొదటిసారికాదు. ఇలాంటివి గతంలో చాలా జరిగాయి. గత నెలలోన్యూజెర్సీలో ఒక వ్యక్తి $1.13 బిలియన్ల మెగా మిలియన్ల జాక్‌పాట్‌ను గెలుచుకున్నాడు.



Next Story

Most Viewed