- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిరాణా షాప్ కి వెళ్లిన యువతి అదృశ్యం
దిశ, చౌటుప్పల్: కిరాణా షాప్ కి వెళ్లి వస్తా అని ఇంట్లో చెప్పి వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపురం మండలం డాకుతండాకు చెందిన కరంటోతూ బన్సీలాల్ కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతని పెద్ద కుమార్తె శ్రీలతను చౌటుప్పల్ కు చెందిన శంకర్ కు ఇచ్చి వివాహం జరిపించారు. వీరు చౌటుప్పల్ పట్టణంలోని సుందరయ్య కాలనీలో నివాసం ఉంటున్నారు. బన్సీలాల్ చిన్నకుమార్తె మౌనిక(23) గత 15 రోజుల క్రితం చౌటుప్పల్ లో నివాసముండే తన అక్క శ్రీలత ఇంటికి వచ్చింది. అయితే ఈ నెల 5న సాయంత్రం నాలుగు గంటలకు కిరాణా షాప్ కి వెళ్లి వస్తానని తన అక్క శ్రీలతతో చెప్పి ఇంటి నుండి బయలుదేరింది. రాత్రి అయినా తన చెల్లి మౌనిక తిరిగి ఇంటికి రాకపోవడంతో శ్రీలత తన తండ్రి బన్సీలాల్ కు సమాచారం అందించింది. వెంటనే చౌటుప్పల్ కు చేరుకున్న బన్సీలాల్ తన కూతురు మౌనిక కోసం వెతకగా ఎలాంటి ఆచూకీ దొరకలేదు. దీంతో ఆయన శుక్రవారం చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగిరెడ్డి తెలిపారు.