- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆశ్చర్యం.. యువతిని పెళ్లాడిన యువతి
దిశ, వెబ్‌డెస్క్: ఓ యువతిని పెండ్లి చేసుకున్న మరో యువతి.. తమ ప్రేమ వివాహానికి పెద్దలు అడ్డొచ్చారని పోలీసులను ఆశ్రయించారు. యువతి-మరో యువతిని పెండ్లి చేసుకోవడం ఎంటని ఆశ్చర్యపోతున్నారా.. ఇటీవల కాలంలో స్వలింగ సంపర్కులు చాలా చోట్ల ఇలా తమ హక్కుల కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అబ్బాయిలు మరో అబ్బాయితో.. అమ్మాయిలు.. మరో అమ్మాయితోనే జీవించేందుకు ఇష్టపడుతున్నారు. ఇటువంటి ఘటనే తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో వెలుగుచూసింది.
వివరాళ్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన యువతి ఏక్తా.. అయోధ్యలో నివాసం ఉంటున్న వర్ష దూరపు బంధువులు.
చుట్టరికంతో ఒకరి ఇంటికి మరొకరు వచ్చి వెళ్తుండేవారు. వీరిద్దరూ ఒకరి పై మరొకరు బంధాన్ని పెంచుకున్నారు. మంచి స్నేహితుల వలే ఉండి ఒక్కసారిగా ప్రేమ లోకంలో మునిగి తేలారు. ప్రేమకు వయసుతో పని లేదు అన్నట్టుగా.. వారి ప్రేమకు లింగ బేధం లేదన్నట్టు కాస్తా హద్దు మీరారు. దీంతో సదరు తల్లిదండ్రులు ఇద్దరిని మందలించారు. అమ్మాయిలు-అమ్మాయిలు ప్రేమించుకోవడం ఏంటని నిలదీశారు.
దీంతో ఆ ఇద్దరు యువతులు ఓ నిర్ణయానికి వచ్చారు. తమ ప్రేమ వ్యవహారం పై తల్లిదండ్రులతో గట్టిగా వాదించలేక ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆగస్టు 26 వ తేదీన ఓ గుడిలో ఇద్దరూ కలిసి పెండ్లి చేసుకున్నారు. ఇక ఇంట్లో తెలిస్తే తమకు సహకరించరని తెలిసి నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు. పెండ్లి చేసుకొని స్టేషన్‌కు వచ్చిన వారిని చూసి పోలీసులు సైతం షాక్ అవ్వకమానలేదు.
అనంతరం స్టేషన్‌కు చేరుకున్న తల్లిదండ్రులు, బంధువులు వారిద్దరి వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలా చేసి కుటంబ ప్రతిష్టను దిగజార్చారని వాపోయారు. అయినా.. ఆ ఇద్దరు యువతులు ఒకరిని వదిలి మరొకరం ఉండలేము అని తేల్చి చెప్పారు. దీంతో తల్లిదండ్రులు సైతం చేసేదేమి లేక దీవించేశారు. తాము ఇద్దరం మేజర్లం అంటూ.. తమకు నచ్చిన వ్యక్తులను వివాహం చేసుకునే స్వేచ్ఛ ఉందంటూ సదరు యువతులు గట్టిగా వాదించి.. పోలీసుల సమక్షంలో తల్లిదండ్రులను ఒప్పించడం గమనార్హం.