ఫేస్ బుక్‌లో ప్రేమ.. లాడ్జ్‌లో అలా చేసిన యువతి.. చివరికి

by srinivas |   ( Updated:2021-09-23 23:45:25.0  )
ఫేస్ బుక్‌లో ప్రేమ.. లాడ్జ్‌లో అలా చేసిన యువతి.. చివరికి
X

దిశ, వెబ్‌‌డెస్క్ : ఒకప్పుడు మనిషిని చూసి నచ్చిందంటే చాలు ప్రేమించేసేవారు. కానీ, మారుతున్న సమాజం బట్టి మనం మారాలిగా అన్నట్టు, ఇప్పుడు ప్రేమలు కూడా ఆన్ లైన్‌లోనే చిగురిస్తున్నాయి. కానీ, ఈ ఆన్‌లైన్ ప్రేమ మోజులో పడి , చివరికి మోసపోయి యువత ప్రాణాలను తీసుకుంటున్నారు. ఇలానే ఓ అమ్మాయి ఆన్‌లైన్‌లో అబ్బాయితో ప్రేమలో పడి, చివరికి ప్రాణం తీసుకోవడాని సిద్ధపడిన ఘటన ఏపీలోని మదన పల్లిలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్లితే.. బెంగుళూరు‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ఓ యువతి మదనపల్లి లోని అబీద్ అనే యువకుడు ఫేస్ బుక్‌లో పరిచయం అయ్యాడు. వీరి పరిచయం కొన్ని రోజుల్లోనే ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. అయితే, పెళ్లిని ఏపీలో చేసుకుందామని డబ్బులు పంపించు, ఇక్కడ పెళ్లి ఏర్పాట్లు చేస్తాను అని యువతి నుంచి దాదాపు మూడు లక్షలకు పైగా ప్రియుడు తీసుకున్నాడు. యువతి కూడా పూర్తిగా అబ్బాయిని నమ్మి అతను అడిగిన ప్రతీ సారి డబ్బులు పంపించేది. అయితే కొన్ని రోజుల నుంచి అబీద్ యువతిని కాస్త దూరం పెట్టడం మొదలు పెట్టాడు. దీంతో ఆగ్రహానికి లోనైన ఆమె, నేరుగా మదనపల్లి‌లోని అతడి ఇంటికి వచ్చింది. కానీ, అతడు పెళ్లికి నో చెప్పడంతో పోలీసులను ఆశ్రయించింది. అయితే ఇప్పటివరకు పోలీసులు ఆ కేసును పట్టించుకోకపోవడం‌తో మళ్ళీ మదనపల్లి వచ్చిన యువతి లాడ్జిలో ఆత్మహత్య యత్నం చేసింది. సిబ్బంది గమనించి ఆస్పత్రికి తరలించడం‌తో ప్రాణాపాయం తప్పింది.

Advertisement

Next Story