- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ పాటలు.. రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తాయి
దిశ, సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ యువ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన ఆడియో సీడీని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి, కార్యనిర్వహక అధ్యక్షురాలు రాణి రుద్రమ ఆవిష్కరించారు. సంగారెడ్డి పట్టణంలోని ఐబీలో జిల్లా పార్టీ అధ్యక్షులు మిద్దెల గాల్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిట్ట బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలను పట్టించుకునే నాథుడే లేడని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వడ్ల సాయిబాబా పాటల రూపంలో రాసి, తెలంగాణ సిస్టర్స్ రాసిన పాటలు రాష్ట్రంలో అలజడిని సృష్టిస్తాయని స్పష్టం చేశారు. పాటలు రాసి పాడినవారికి రాణి రుద్రమ అభినందనలు తెలిపారు. అంతేగాకుండా కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలలో కోవిడ్-19 ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.