- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డెబ్యూ మూవీ రిలీజ్ కాకుండానే.. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ మృతి
కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ ఏవీ అరుణ్ ప్రసాద్(వెంకట్ పక్కర్) మృతి చెందాడు. ఈరోజు (శుక్రవారం) ఉదయం రోడ్డు ప్రమాదానికి గురైన అరుణ్.. అక్కడికక్కడే చనిపోయాడు. జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా తెరకెక్కిన 4జీ మూవీకి.. అరుణ్ డైరెక్టర్ కాగా, లాక్‌డౌన్ కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది. తన తొలి సినిమా రిలీజ్ కాకముందే డైరెక్టర్ చనిపోయిన వార్త కోలీవుడ్‌ను షాక్‌కు గురిచేసింది.
అరుణ్ ప్రసాద్.. డైరెక్టర్ శంకర్ దగ్గర పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ‘ఐ’ సినిమాకు కూడా ఆయనతో కలిసి పనిచేసిన అరుణ్ మృతి కలిచివేస్తోందని డైరెక్టర్ శంకర్ ట్వీట్ చేశాడు. అరుణ్ ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటూ.. కష్టపడి పనిచేసేవాడని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్న శంకర్.. కుటుంబీకులకు, మిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జీవీ ప్రకాష్ కూడా అరుణ్ ఆకస్మిక మృతిని జీర్ణించుకోలేక పోతున్నానని తెలిపాడు. ఫ్రెండ్లీగా, పాజిటివ్‌గా ఉండే అరుణ్‌ను కోల్పోవడం బాధాకరమన్నారు. వారి కుటుంబానికి దేవుడు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు.