చికిత్స పొందుతూ యువకుడు మృతి.

by Shyam |
చికిత్స పొందుతూ యువకుడు మృతి.
X

దిశ, మునుగోడు: కొండపై నుంచి జారి పడిన యువకుడు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా నారాయణపురం మండల పరిధిలోని డాకు తండా గ్రామంలోని దూకుడు గుట్టలను సందర్శించడానికి గుడిమల్కాపురం గ్రామానికి చెందిన సయ్యద్ రజాక్ తన ఆరుగురు స్నేహితులతో కలిసి వెళ్లారు. గురువారం సాయంత్రం వీరందరూ కలిసి కొండపైకి ఎక్కగా ప్రమాదవశాత్తూ రజాక్(19) అనే యువకుడు ఒక్కసారిగా కిందకు జారి పడిపోయాడు. వెంటనే తేరుకున్నస్నేహితులు బాధితుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా శనివారం నాడు చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందినట్లు నారాయణపురం ఎస్ఐ నాగరాజు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story