బీచ్‌కొచ్చామని బట్టలిప్పుకున్నారు!

by srinivas |
బీచ్‌కొచ్చామని బట్టలిప్పుకున్నారు!
X

దిశ, వెబ్‌డెస్క్: బీచ్‌కొచ్చారు.. బిర్రుగదాగారు.. బట్టలిప్పుకున్నారు. ఆశ్చర్యపోతున్నారా.. మీరు విన్నది నిజమే.. శ్రీకాకుళం జిల్లాలో నలుగురు యువకులు సరదాగా బీచ్ చూడడానికి వచ్చారు. వచ్చిన సంతోషంలో ఫుల్‌గా తాగారు. అంతే, ఆ తర్వాత బాత్‌రూమ్‌లో ఉన్నట్టు వ్యవహరించి బట్టలు విప్పుకుని తిరుగుతూ వీరంగం సృష్టించారు. వారి చుట్టు పక్కల ఎవరు ఉన్నారో ఆదమరిచి ఆగమాగం చేశారు. చివరకు పోలీసులకు చిక్కారు.

వివరాళ్లోకి వెళితే.. విశాఖ జిల్లాకు చెందిన నలుగురు యువకులు.. శ్రీకాకుళంకు వచ్చారు. జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లిలో ఉన్న బీచ్‌‌లో సరదాగా గడిపేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే బీచ్‌కు వచ్చి పీకల దాకా మందు తాగారు. ఆ తర్వాత మద్యం మత్తులో హల్ చల్ చేశారు. ఒకరి తర్వాత మరొకరు శరీరం మీద నుంచి బట్టలు విప్పుకోవడం ప్రారంభించారు.

అనంతరం నగ్నంగా బీచ్‌లో ఉర్రూతలూగడంతో పలువురు స్థానికులు ఇందేంటని ప్రశ్నించారు. అయినా, వారు మద్యం మత్తులో ఉండి నోటికొచ్చిన కూతలు కూశారు. ఎంతకీ చెప్పిన వినకుండా నగ్న ప్రదర్శన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఓ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే, బీచ్ చూడడానికి వచ్చిన వారు సరదాగా గడపకుండా.. బట్టలు విప్పుకోవడం ఏంటని స్థానికులు మండిపడుతున్నారు.

Advertisement

Next Story