కళ్లలో కారం కొట్టాడు.. తేరుకునేలోపు నరికేశాడు

by Anukaran |   ( Updated:2021-04-13 01:08:38.0  )
కళ్లలో కారం కొట్టాడు.. తేరుకునేలోపు నరికేశాడు
X

దిశ, స్టేషన్ ఘన్ పూర్: ఉగాది పండగని బంధువులతో కలిసి జరుపుకునేందుకు హైదరాబాద్​ నుంచి నిడిగొండ వెళ్లింది ఓ కుటుంబం. వేసవి కావడంతో ఆరుబయటే పడుకున్నారు. తెల్లవారితే కుటుంబంతో కలిసి పండగను ఆనందంగా జరుపుకోవాలనుకున్నారు. కానీ .. అంతలోనే ఒక ఆగంతకుడి రూపంలో మృత్యు దేవత ఆ ఇంట్లో అడుగుపెట్టింది. నిద్రిస్తున్న వారిపై కారంపొడి చల్లి ఒక గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లిలో మండలం నిడిగొండ లో చోటు చేసుకుంది.

జనగామ జిల్లా రఘనాథపల్లి మండలం నిడిగొండ కు చెందిన వంగాల దినేష్ హైదరాబాదులో ఉంటున్నాడు. ఉగాది పండుగ స్వగ్రామంలో జరుపుకునేందుకు కుటుంబంతో సహా నిడిగొండ కి వచ్చాడు. భోజనాలు ముగించుకుని అందరు నిద్రకు ఉపక్రమించారు. ఇంటి వరండాలో నిద్రిస్తున్న వారిపై గుర్తుతెలియని ఓ వ్యక్తి కారంపొడి చల్లి గొడ్డలితో దాడి చేశాడు. వంగాల దినేష్ ని గొడ్డలితో కసి తీరా నరికేశాడు. అతనిని కాపాడేందుకు యత్నించిన మృతుని బాబాయి వంగాల మహేష్​కు తీవ్రగాయలు కాగా వెంటనే చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ఈ హత్యకు భూవివాదాలు కారణమైనట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాపు చేపట్టారు.

Advertisement

Next Story