ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని యువకుడి మృతి..

by Sridhar Babu |
ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని యువకుడి మృతి..
X

దిశ, ఖమ్మం : అన్నపురెడ్డిపల్లిలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ ఢీ కొట్టడంతో యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ జీలుగుమిల్లి కాలనీకి చెందిన మేడరాజు( 24) తన ద్విచక్రవాహనం (TS04 ET 2640)పై పాల్వంచ లోనీ తన మిత్రుడు వివాహానికి వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో మండల పరిధిలోని తొట్టి పంపు వద్ద లారీ(TS04 OC 6139) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజు తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానిక ఎస్ఐ తిరుపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed