- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన భార్య.. ప్రియుడి గొంతు కోసి..!
దిశ, ఉప్పల్ : వివాహేతర సంబంధం కారణంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగుచూసింది. నేహా అనే మహిళ సోహెల్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోగా.. రాత్రి భర్త లేని సమయంలో తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. సరిగ్గా అదే సమయంలో భర్త ఇంటికి రాగా, ఎక్కడ తమ అక్రమ సంబంధం భయపడుతుందోనని భావించిన నేహా సరికొత్త నాటకానికి తెరలేపింది.
వివరాల్లోకి వెళితే.. నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్లాపూర్‌లో చోటేదాస్ ఇంట్లో మొయిన్ ఖాన్ (27) అతని భార్య నేహా బేగమ్(25)తో పాటు ముగ్గురు పిల్లలు కలిసి నివాసముంటున్నారు. గతంలో వీరు వారాసిగూడలో ఉండేవారు. దీంతో సమీపంలోని సోహెల్ (22) అనే వ్యక్తితో నేహా బేగంకు పరిచయం ఏర్పడింది. నాటి నుంచి నేహా బేగమ్ భర్తకు తెలియకుండా సోహెల్‌ను కలుస్తూ ఉండేది. విషయం తెలుసుకున్న భర్త మొయిన్ ఖాన్ మూడు నెలల కిందట మకాం మల్లాపూర్‌కు మార్చాడు. మొయిన్ ఖాన్ సికింద్రాబాద్ స్టేషన్ సమీపంలో ఫుట్‌పాత్‌పై బ్యాగులు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇటీవల సోహెల్ రాత్రి వేళ ఇంటికి రావడంతో భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో నేహా బేగం కొత్త నాటకానికి తెరలేపింది. సోహెల్ తనను బలవంతం చేయబోయాడని చెప్పడంతో పాటు దంపతులు ఇద్దరూ కలిసి సోహెల్‌ను గొంతుకోసి కిరాతకంగా హత్య చేశారు. పోలీసుల దర్యాప్తులో భార్యభర్తలు ఇద్దరూ సోహెల్‌ను హత్య చేసినట్లు తేలింది. కాగా, ప్రస్తుతం నిందితులిద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారు.