మల్లన్న ఓటమి: యువకుడు సూసైడ్

by Anukaran |   ( Updated:2021-03-21 01:42:27.0  )
మల్లన్న ఓటమి: యువకుడు సూసైడ్
X

దిశ, చందూరు: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ స్థానానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించగా.. ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గట్టి పోటీ ఇచ్చారు. అధికార టీఆర్‌ఎస్‌తో తీన్మార్ మల్లన్న పోరాడి ఓడారని చెప్పవచ్చు. ఒక దశలో పల్లా, తీన్మార్ మల్లన్న మధ్య తక్కువ ఓట్ల మెజార్టీ ఉండటంతో.. తీన్మార్ మల్లన్న గెలుస్తారేమోనని చాలామంది భావించారు. కానీ ఉత్కంఠ మధ్య జరిగిన రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత పల్లా విజయం సాధించారు.

అయితే తీన్మార్ మల్లన్న ఓటమిని తట్టుకోలేక ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లికి చెందిన శ్రీశైలం అనే యువకుడు తీన్మార్ మల్లన్నకు మద్దతుగా ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశాడు. కానీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పరాజయం పాలవ్వడంతో తట్టుకోలేక పురుగులమందు తాగి సూసైడ్ చేసుకున్నాడు.

యువకుడి ఆత్మహత్యపై స్పందించిన తీన్మార్ మల్లన్న.. ఇది చాలా బాధకరమైన విషయమని, ఎవరూ ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహాజమని, శ్రీశైలం కుటుంబానికి అండగా నిలుస్తానన్నారు.

Advertisement

Next Story