ఈ మధ్యే పెళ్లి.. బావి వద్ద మృతి

by Sumithra |
ఈ మధ్యే పెళ్లి.. బావి వద్ద మృతి
X

దిశ, కోదాడ: అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందిన సంఘటన సోమవారం సూర్యపేట జిల్లా మునగాల మండల పరిధిలోని తాడువాయి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తాడువాయి గ్రామానికి చెందిన బెల్లి రామచంద్ర కుమారుడు అనిల్ యాదవ్ (24) ఆదివారం బావి వద్దకు వెళ్లి తిరిగి రాలేదు.

సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చూడగా అతడి మృతదేహం కనిపించింది. అతనికి జూన్ 19న వివాహం జరిగినట్లు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story