అక్కడ మద్యం తాగొచ్చు.. సెక్స్ చేయోచ్చు

by Anukaran |
అక్కడ మద్యం తాగొచ్చు.. సెక్స్ చేయోచ్చు
X

దిశ, వెబ్‌డెస్క్ : పర్యాటకులను ఆకర్షించడానికి హోటల్స్, విమానయాన సంస్థలు, ట్రావెల్ ఏజెన్సీలు పలు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఫిల్మ్ సిటీలు, పార్కుల నిర్వాహకులు, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం విన్నూత్న ప్యాకేజీలను ప్రవేశపెడుతుంటాయి. కానీ ఓ దేశం ఏకంగా చట్టాలనే మార్చి సంచలనానికి తెర లేపింది. ఇక నుంచి ఆ దేశంలో పీకల దాక మద్యం తాగవచ్చు.. నచ్చిన మగువతో సహజీవనం చేయవచ్చు.. ఇష్టం వచ్చినన్ని రోజులు ఎంజాయ్ చేయవచ్చు. ఇంతకీ అది ఏ దేశం.. ఏంటా చట్టం తెలుసుకోవాలంటే ‘దిశ’అందిస్తున్న ఈ కథనం చదవాల్సిందే..!

ఇస్లామిక్ దేశాలంటే కఠిన చట్టాలకు పెట్టింది పేరు. ఏ చిన్న నేరం చేసిన బహిరంగంగా ఉరి శిక్షలను సైతం అమలు చేస్తారు. అలాంటిది పర్యాటకుల కోసం కఠిన చట్టాలను సైతం మార్చుతోంది ఇస్లామిక్‌ దేశాలతో కూడిన యూఏఈ దేశం. యూఏఈలో ఇప్పటి వరకు మద్యం సేవించినా, మద్యాన్ని కలిగి ఉన్నా నేరంగా పరిగణించేవారు. అలాగే సహజీవనం చేసినా తీవ్ర నేరంగా చూసేవారు. కానీ టూరిస్టులను ఆకర్షించేందుకు చట్టాలను సరళతరం చేస్తూ.. కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మద్యపానం సేవించడం, సహజీవనం చట్టవిరుద్ధం కాదని ప్రకటించింది.

దేశంలో అవివాహిత జంటలు ఒకేచోట నివసించేందుకు అనుమతించడంతో పాటు మద్యపానంపై నియంత్రణలను సరళతరం చేయడంతోపాటు ఇస్లామిక్‌ వివాహ చట్టాల్లో కీలక మార్పులను యూఏఈ ప్రకటించింది. 21 సంవత్సరాలు పైబడిన వారు స్వేచ్ఛగా మద్యాన్ని సేవించవచ్చు. అవివాహిత జంటలు సైతం కలిసి జీవించవచ్చని, సహజీవనం చేయవచ్చని పేర్కొంది.పెట్టుబడుల వాతావరణం, చట్టాల అమలును మెరుగుపరిచే చర్యల్లో భాగంగా ఈ సంస్కరణలను చేపట్టామని యూఏఈ ప్రభుత్వం పేర్కొంది. కాగా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజలు స్వాగతించారు.

Advertisement

Next Story

Most Viewed