- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యెస్ బ్యాంకుపై రూ. 25 కోట్ల పెనాల్టి విధించిన సెబీ
దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేట్ రంగ బ్యాంకు యెస్ బ్యాంక్‌కు ఆర్థిక కష్టాలు ఇంకా వీడలేదు. ఇదివరకు బ్యాంకు ఫౌండర్ చేసిన మోసాలకు ఇబ్బందులను ఎదుర్కొన్న యెస్ బ్యాంక్ తాజాగా బాండ్లకు సంబంధించి మోసపూరిత చర్యలకు పాల్పడిందని మార్కెట్ల నియంత్రణ సంస్థ(సెబీ) రూ. 25 కోట్ల పెనాల్టీ విధించింది. ఏటీ-1 బాండ్ల కేసులో అవకతవకలకు పాల్పడినందుకు గాను బ్యాంకుతో పాటు ముగ్గురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లపై రూ. 25 కోట్ల జరిమానా విధిస్తూ, దీనిపై అప్పీల్ చేసుకోవడానికి వెసులుబాటు ఇచ్చింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసిన వినియోగదారులను బలవంతంగా, మోసపూరితంగా ఏటీ-1 బాండ్‌ల వైపునకు మళ్లించినట్టు యెస్ బ్యాంకుపై ఆరోపణలున్నాయి. యెస్ బ్యాంకు వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సెబీ విచారణ జరిపి మోసం జరిగినట్టు నిర్ధారించింది. యెస్ బ్యాంకు ఈ బాండ్లను 2016, డిసెంబర్ నుంచి 2020, ఫిబ్రవరి మధ్య కాలంలో విక్రయించినట్టు తెలుస్తోంది. కొనుగోలుదారుల ఇష్టంతో సంబంధం లేకుండా యెస్ బ్యాంక్ 1,300 మందితో ఈ కొనుగోళ్లను చేయించినట్టు తేలింది.