- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాళేశ్వరానికి ఆయువు పట్టు ఆ రెండే!
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా నిర్మించిన ఆ రెండు ప్రాజెక్టులు ప్రస్తుతం కాళేశ్వరానికి కీలకంగా మారాయి. పదిహేనేళ్ల క్రితం నిర్మించిన ఎల్లంపల్లి, మిడ్ మానేరు ప్రాజెక్టులు నేటికీ ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. అయినా కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ రెండు ప్రాజెక్టులే ఆయువు పట్టులా మారాయి. కాళేశ్వరం లింక్ 1, 2లో ఆయువు పట్టుగా ఉపయోగపడుతున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులే లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఖర్చు మరింత పెరిగేది.
దిశ ప్రతినిధి, కరీంనగర్:
పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల సరిహద్దుల్లో గోదావరి నదిపై శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణ పనులను 2004లో ప్రారంభించారు. గోదావరి నదిపై నిర్మిస్తున్న నాలుగో అతిపెద్ద ప్రాజెక్టు అయిన ఎల్లంపల్లి రిజర్వాయర్‌ను 20 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. రామగుండం ఎన్టీపీసీ, పారిశ్రామిక ప్రాంతం, సాగునీటి అవసరాలకు, హైదరాబాద్‌కు తాగునీటి కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీటితో ప్రాజెక్టును రూపొందించారు. వైఎస్సార్ మరణం తరువాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టును ప్రారంభించాలని భావించినా కాంగ్రెస్ నాయకుల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. దీంతో ప్రారంభోత్సవానికి నోచుకోకున్నా 2010 నుంచి వినియోగంలోకి వచ్చింది.
లింక్-2లో మిడ్ మానేరు..
మానేరు నదిపై నిర్మించిన మిడ్ మానేరు ప్రాజెక్టు కాళేశ్వరం లింక్ 2 ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఇక్కడి నుంచి సిరిసిల్ల ప్రాంతాన్ని సస్యశామలం చేసే ప్యాకేజీ 9, అనంతగిరి, లోయర్ మానేరు డ్యాం, సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్‌లకు నీటిని తరలిస్తారు. 2004లోనే శంకుస్థాపనకు నోచుకున్న ఈ ప్రాజెక్టు మొదట ఎస్సారెస్పీ ఫేజ్ 2 నిర్మాణం కోసం చేపట్టగా.. ఇప్పుడు కాళేశ్వరం లింక్ 2కు పెద్ద దిక్కుగా మారింది. నిర్దేశించుకున్న గడువులో పూర్తికాకపోవడంతో ఈ ప్రాజెక్టు తెలంగాణ ఆవిర్భావం తరువాత సేవలందిస్తోంది. మొదట 24 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం చేపట్టిన మధ్య మానేరును 27 టీఎంసీలకు పెంచారు. ఈ ప్రాజెక్టును కూడా నేటికీ ప్రారంభించకపోవడం గమనార్హం.
లింక్-1లో ఎల్లంపల్లి కీలకం..
తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఎల్లం పల్లి ప్రాజెక్టు అత్యంత కీలకంగా మారిం ది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారే జీల నుంచి పంప్‌హౌజ్‌ల ద్వారా ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇక్కడి నుంచి నందిమేడారం, లక్ష్మీnపూర్ సర్జి పూల్‌కు నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. లక్ష్మీపూర్ గాయత్రి పంప్ పంప్‌హౌ జ్‌కు ఎగువన నిర్మించిన వైజంక్షన్ ద్వారా మిడ్ మానేరు, వరద కాలువకు నీటిని తరలిస్తున్నారు. దీంతో కాళేశ్వ రం ప్రాజెక్టుకు ఎల్లంపల్లి ఆయువు పట్టుగా మారింది. లింక్‌వన్‌లో అత్యంత కీలక భూమిక పోషిస్తున్న ఎల్లంపల్లి లేనట్లయితే.. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరింత ఖర్చు అయ్యేది.