ఆ విషయం ప్రజలందరికీ తెలుసు: రోజా

by srinivas |
roja
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ నడుస్తున్నారన్న విషయం ప్రజలందరికీ తెలుసని వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. 2018లో చంద్రబాబు స్థానిక ఎన్నికల నిర్వహణకు భయపడ్డారన్న రోజా.. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తికాకుండా ఎన్నికలు నిర్వహించడం అవసరమా అని ప్రశ్నించారు. కొవిడ్ సమయంలోచంద్రబాబు ఎటువంటి సాయం చేయలేదని, అహంకారంతో ప్రజా ప్రతినిధులను అగౌరవ పరుస్తున్నారని అన్నారు. ఎన్నికలంటే సీఎం జగన్‌కు భయం లేదని.. స్థానిక ఎన్నికలకు వైసీపీ ఎప్పుడైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు.

Next Story

Most Viewed