సినిమాల్లోకి వైసీపీ ఎమ్మెల్యే

by Anukaran |   ( Updated:2020-07-22 04:51:34.0  )
సినిమాల్లోకి వైసీపీ ఎమ్మెల్యే
X

దిశ, వెబ్ డెస్క్: సినిమాల్లో ఉన్నవారు రాజకీయాల్లోకి రావడం, రాజకీయాల్లో ఉన్నవారి వారసులు సినిమాల్లోకి రావడం ప్రస్తుతం సర్వసాధారణంగా మారింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ నుంచి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి వరకూ అందరూ సినిమాల్లో రాణించి రాజకీయాల్లోకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా విశాఖ జిల్లా చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ స్వతహాగా కళాకారుడు. చిన్న వయసు నుంచే నటనపై ఆయనకు ఆసక్తి సైతం ఉంది. తన స్వగ్రామం కేజేపురంలో పలు నాటకాల్లో నటించి జనాల మన్ననలను పొందారు. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు హైదరాబాదులో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో అన్నమయ్య పాత్రను పోషించి… అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి చేత ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత కూడా ఎమ్మెల్యేగా ప్రజా కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నప్పటికీ… తనలోని కళాపోషణను ఆయన రుజువుచేసుకుంటున్నారు.

తాజాగా ‘మోదకొండమ్మ’ అనే సినిమాలో ధర్మశ్రీ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గాజువాకలో జరుగుతోంది. గిరిజనులు ఆరాధించే దైవం మోదకొండమ్మ. ఈ చిత్రంలో పరమశివుడికి, ఆయన తపస్సును భంగం చేయడానికి వచ్చిన మాంత్రికునికి మధ్య సన్నివేశాలను తాజాగా చిత్రీకరించారు. ఈ చిత్రంలో శివుడి పాత్రను ధర్మశ్రీ పోషిస్తున్నారు.

Advertisement

Next Story