వైసీపీ మేయర్ అభ్యర్థులు వీరే!

by srinivas |
వైసీపీ మేయర్ అభ్యర్థులు వీరే!
X

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించగా.. మేయర్ అభ్యర్థులు ఎవరనే దానిపై వైసీపీ అధిష్టానం కసరత్తులు చేస్తోంది. మేయర్ పదవులకు వైసీపీలో భారీ పోటీ నెలకొంది. ఆశావాహులు పెద్ద సంఖ్యలో ఉండటంతో.. మేయర్ అభ్యర్థుల విషయంలో వైసీపీ హైకమాండ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.

అయితే ఇప్పుడిప్పుడే వైసీపీ మేయర్ అభ్యర్థుల జాబితా కొలిక్కి వస్తోంది. గుంటూరు మేయర్ అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడు పేరు దాదాపుగా ఖరారు అవ్వగా.. కర్నూలు మేయర్ అభ్యర్థిగా బి.వై.రామయ్య, కడప మేయర్‌గా అభ్యర్థిగా కె.సురేష్ బాబు, ఒంగోలు మేయర్‌ అభ్యర్థిగా సుజాత, తిరుపతి మేయర్‌ అభ్యర్థిగా శిరీష, విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా భాగ్యలక్ష్మి, వైజాగ్ మేయర్‌ అభ్యర్థిగా బాణాల శ్రీనివాస్, శ్రీధర్, ఉషశ్రీ పేర్లను పరిశీలిస్తున్నారు.

ఇక విజయనగరం మేయర్ అభ్యర్థిగా ఎడ్ల కృష్ణవేణి పేరు ఖరారు అయినట్లు సమాచారం. ఇక మచిలీపట్నం, అనంతపురం, చిత్తూరు మేయర్ అభ్యర్థుల ఖరారుపై కసరత్తు కొనసాగుతోంది.

Advertisement

Next Story