వైసీపీ రద్దు పిటిషన్‎పై విచారణ వాయిదా..!

దిశ వెబ్‎డెస్క్: రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు, వాయిదాలు నడుస్తుండగా తాజాగా వైసీపీ ప్రభుత్వానికి మరో తలనొప్పి వచ్చిపడింది. వైసీపీ గుర్తింపును రద్దు చేయాలనే పిటిషన్‎పై ఢిల్లీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. వైసీపీ ఉపయోగిస్తున్న లెటర్ హెడ్‎లు, పోస్టర్లు, బ్యానర్లలో ఉపయోగించే తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

జగన్ ఆధ్వర్యంలోని పార్టీని రద్దు చేసి వైసీపీ పేరు వాడకుండా చూడాలని పిటిషనర్ కోరారు. ఈ విషయంపై నాలుగు వారాల్లోగా కౌంటర్ వేయాలని వైసీపీ, సీఈసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో రిజాయిండర్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను నవంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement