పూరి, యశ్ పాన్ ఇండియా ప్లాన్?

by Shyam |
పూరి, యశ్ పాన్ ఇండియా ప్లాన్?
X

దిశ, వెబ్‌డెస్క్ :
పాన్ ఇండియా సినిమా ‘కేజీఎఫ్’తో నేషనల్ లెవల్ స్టార్‌గా ఎదిగిన యశ్.. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారని ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే పూరి కథ కూడా వినిపించగా.. యశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్‌లో ఉండబోతుందని తెలుస్తోంది. ఈ గ్రేట్ కాంబినేషన్‌లో సినిమా కోసం యశ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే పూరి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్న జనగణమణ స్క్రిప్ట్ యశ్ చేయబోతున్నాడా? అనే చర్చ కూడా జరుగుతోంది.

కాగా, పూరి ప్రస్తుతం రౌడీ హీరో విజయ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఫైటర్’ సినిమా పనుల్లో ఉండగా.. యశ్ కేజీఎఫ్ చాప్టర్ 2 ఫైనల్ షెడ్యూల్ షూటింగ్‌లో ఉన్నాడు. ఆ తర్వాత సినిమా విడుదలపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed