కరణ్ కొడుకు ఖతర్నాక్ ఆన్సర్ !

by Shyam |   ( Updated:2023-10-10 16:01:35.0  )
కరణ్ కొడుకు ఖతర్నాక్ ఆన్సర్ !
X

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్.. లాక్‌డౌన్ పీరియడ్‌ను తన పిల్లలతో గడుపుతున్నారు. కరణ్‌కు ఫ్యాషన్ క్రిటిక్స్‌గా మారిన చిన్నారులు రూహీ జోహార్, యష్ జోహార్‌ల అల్లరిని ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటాడు. అయితే వారిని స్కూల్ మెమొరీస్‌కు తీసుకెళ్లేందుకు క్విజ్‌లో భాగంగా పిల్లలను కొన్ని ప్రశ్నలు అడిగాడు కరణ్.

నీ పేరేంటి అని అడిగితే.. ‘యశ్ కరణ్ జోహార్’ అని చెప్పిన బుడతడు.. మనం ఏ సిటీలో నివసిస్తున్నామని అడిగితే ‘ముంబై’ అని చెప్పాడు. అయితే వీటిలో మన దేశం పేరేంటి అని అడిగితే యశ్ ఇచ్చిన ఆన్సర్ మాత్రం చాలా క్యూట్‌గా ఉంది. ‘మన దేశం పేరు.. అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్’ అంట. యశ్ నుంచి వచ్చిన ఈ సమాధానం అసలు మిస్ కావద్దు అంటూ ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేశాడు కరణ్.

Advertisement

Next Story

Most Viewed