చేనేత కార్మికులకు యారన్ సబ్సిడీ చెల్లించండి

by Sridhar Babu |
చేనేత కార్మికులకు యారన్ సబ్సిడీ చెల్లించండి
X

దిశ, కరీంనగర్: బతుకమ్మ చీరలు తయారుచేసిన కార్మికులకు ప్రభుత్వం చెల్లించాల్సిన 10 శాతం యారన్ సబ్సిడీని వారి అకౌంట్లలో జమ చేయాలని తెలంగాణ పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. మంగళవారం సిరిసిల్ల జిల్లాలోని పవర్‌లూమ్ కార్మికులు తమ ఇళ్ళ ముందు ప్లకార్డులు ప్రదర్శించారు. పెండింగ్ సబ్సిడీ విషయం ప్రభుత్వానికి గుర్తుచేయడానికి సీఐటీయూ అనుబంధ తెలంగాణ పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు కార్మికులు తమ ఇళ్ల ముందు నిలబడి ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్బంగా తెలంగాణ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ మాట్లాడుతూ 40 రోజుల నుంచి లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో కార్మికులు ఇళ్ళకే పరిమితమై ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని విరరించారు. కాబట్టి సబ్సిడీ డబ్బులు వారి అకౌంట్లో జమ చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. ప్రస్తుతం కార్మికులకు ఆర్డర్లు లేకపోవడంతో ఉపాధి లేకుండా పోయిందన్నారు. కార్మికులకు బంద్ కాలం వేతనాలు చెల్లించాలని ఆదేశించినప్పటికీ సిరిసిల్ల యాజమాన్యాలు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. కార్మికులకు రావాల్సిన సబ్సిడీ డబ్బులు టెస్కో వద్ద రూ.18 కోట్లు ఉన్నాయన్నారు. వాటిని వెంటనే కార్మికులకు అందించేలా చొరవ చూపాలన్నారు.

tags : batukamma sarees, powerloom labours, yaran sabsidy charge add to account, citu demand

Advertisement

Next Story

Most Viewed