‘నామినేటెడ్ పోస్టులపై సెటైర్లు.. మరో దోపిడికి కొత్త తెర’

by srinivas |
‘నామినేటెడ్ పోస్టులపై సెటైర్లు.. మరో దోపిడికి కొత్త తెర’
X

దిశ, ఏపీ బ్యూరో: సీఎం వైఎస్ జగన్‌పై మాజీమంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. నామినేటెడ్ పదవులపై మండిపడ్డారు. పరిపాలించే స్థానాల్లో సొంత వారు.. పరిపాలించబడే స్థానాల్లో బడుగులా? అంటూ ప్రశ్నించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన అధికారాలు, నిధులున్న పదవులు సొంతవర్గం వారికి కట్టబెట్టి నిధులు లేని, అప్రధాన్య పదవుల్ని బడుగు వర్గాలకు కేటాయించారంటూ నామినేటెడ్ పోస్టులపై సెటైర్లు వేశారు.

రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఎలా ఉన్నా.. దుబారాకు మాత్రం సీఎం జగన్ వెనుకాడటం లేదన్నారు. ఆయన దుబారాకు రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసేశారని ఆరోపించారు. ఆర్ధిక వ్యవస్థను భ్రష్టుపట్టించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమానికి, జీతాలకూ అప్పులపైనే ఆధారపడాల్సిన దుస్థికి ఆర్థిక వ్యవస్థను తీసుకువచ్చారన్నారు. సలహాదార్ల పేరుతో వందల కోట్లు దుబారా చేస్తున్నారని, ఇప్పుడు నామినేటెడ్ పదవుల పేరుతో మరో దోపిడీకి సిద్ధమయ్యారని విమర్శించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ నిధుల్ని ప్రభుత్వం మళ్లించి..ఆ సామాజిక వర్గాలకు తీరని అన్యాయం చేస్తున్నారని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు.

Advertisement

Next Story