ఏ డ్రెస్ వేసుకుంటే నీకేంటి? కాస్టింగ్ డైరెక్టర్‌పై హీరోయిన్ ఫైర్

by Jakkula Samataha |   ( Updated:2021-03-04 04:17:37.0  )
ఏ డ్రెస్ వేసుకుంటే నీకేంటి? కాస్టింగ్ డైరెక్టర్‌పై హీరోయిన్ ఫైర్
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ యామీ గౌతమ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పదకొండేళ్లు పూర్తి చేసుకుంది. బాలీవుడ్‌లో గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేకుండానే సక్సెస్‌ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్న యామీ.. తొలినాళ్లలో తాను ఎలాంటి కామెంట్స్ ఫేస్ చేసిందో షేర్ చేసుకుంది. ఆయుష్మాన్ ఖురానా ‘విక్కీ డోనర్’ సినిమా ద్వారా బాలీవుడ్‌కు పరిచయమైన యామీ.. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాక రిలీజ్‌కు ముందే మరో బిగ్ ప్రొడక్షన్ హౌస్‌కు ఆడిషన్ ఇచ్చానని, టాప్ కాస్టింగ్ డైరెక్టర్ తనను ఆడిషన్ చేశారని తెలిపింది. అయితే ‘ఆడిషన్ బాగానే చేశావ్.. షార్ట్ లిస్ట్‌లో కూడా ఉన్నావ్.. చాలా హ్యాపీ.. కానీ వచ్చిన సమస్య ఏంటంటే? నీ ఏజ్‌కు తగినట్లుగా డ్రెస్ చేసుకోవాలి గానీ, ఇలా ఎందుకు వేసుకున్నావ్?’ అని కాస్టింగ్ డైరెక్టర్ కామెంట్ చేశారని చెప్పింది. తను జీన్స్, షర్ట్ వేసుకున్నానని, అందులో తప్పేముందని అడగ్గా.. అందుకు కాస్టింగ్ డైరెక్టర్ ‘యంగర్‌గా కనిపించడమే లక్ష్యంగా ఉండాలి, నువ్వు యంగ్ గర్ల్, ఎందుకు ఏజ్‌కు తగినట్లుగా డ్రెస్ చేసుకోకూడదు’ అని సమాధానం ఇచ్చారని తెలిపింది.

అయితే ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఆ వ్యక్తికి చెప్పదలుచుకున్నవి చాలా ఉన్నాయన్న యామీ.. ‘నేను ఓ క్యారెక్టర్‌కు సెలెక్ట్ అయితే అందుకు తగినట్లుగా కనిపించేలా చేయడం తన హెయిర్ డ్రెస్సర్, స్టైలిస్ట్ పని. మిగిలినది నటిగా నా పని. కానీ బయట ఏం ధరించాలో కూడా ఆయనెందుకు చెప్పాలి’ అని ప్రశ్నించింది. ఇప్పుడు ఇదంతా మాట్లాడటం సులభంగా ఉంది కానీ, కాస్టింగ్ డైరెక్టర్ నుంచి కామెంట్స్ విన్న తర్వాత తనలో ఏదైనా లోపముందా? అనే ఆలోచనతో బయటకు వెళ్లానని, ఇది చాలా ఎఫెక్ట్ చూపిందని వెల్లడించింది.

Advertisement

Next Story