యమధర్మరాజు అవతారం..కరోనాపై అవగాహన

by Shyam |
యమధర్మరాజు అవతారం..కరోనాపై అవగాహన
X

దిశ, మెదక్ : ప్రాణాంతక కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ముత్తంగి ఎంపీటీసీ కుమార్ గౌడ్ విన్నూతంగా యమధర్మరాజు వేషాధారణలో కనిపించారు. వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఎంపీటీసీని అటుగా వెళ్తున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చూశారు. వెంటనే తన వాహనాన్ని ఆపి కుమార్ గౌడ్‌ను అభినందించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలను ప్రజలందరూ పాటించాలని పిలుపునిచ్చారు.ఈ విషయాన్ని తాను కూడా పూర్తిగా స్వాగతిస్తున్నానని ఎమ్మెల్యే చెప్పారు. ఎన్ని నెలలు నిర్భందం విధించినా తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తానని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కుమార్ గౌడ్ యమధర్మరాజు వేషధారణలో ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించడం మంచి విషయమని అభినందించారు. ఎంపీటీసీ కుమార్ గౌడ్ తీసుకున్న నిర్ణయంపై పఠాన్‌చెరు సీఐ నరేష్ స్పందిస్తూ ఆయన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని, ఈ మేరకు ప్రజలందరూ ఇళ్లలోనే ఉంటూ బయటకు రావొద్దని, పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Tags : carona, lockdown, yamadarma raju, acting, medak

Advertisement

Next Story