Telangana Police : ఆకలి బాధ.. చలించిన పోలీసులు.. ఫుడ్ కోసం రోడ్డు బ్లాక్ చేసిన వానరాలు

by Shyam |   ( Updated:2021-05-27 10:49:06.0  )
Telangana Police : ఆకలి బాధ.. చలించిన పోలీసులు.. ఫుడ్ కోసం రోడ్డు బ్లాక్ చేసిన వానరాలు
X

దిశ, యాదగిరిగుట్ట: తెలంగాణలో లాక్‌డౌన్ కారణంగా యాదాద్రి పుణ్యక్షేత్రం భక్తులు లేక వెలవెలబోతుంది. గతంలో భక్తులు అందించే ఆహారంతో కడుపు నింపుకునేవి యాదగిరి గుట్ట పరిసరాల్లో ఉన్న వానరాలు. అయితే, ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆహారం దొరక్క ఆకలితో అలమటిస్తున్నాయి ఆ మూగజీవాలు. ఈ క్రమంలోనే యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ జానకి రెడ్డి కోతుల దీన స్థితిని చూసి చలించిపోయాడు.

ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని కొత్తపేట వాసవీ కాలనిలో నివాసముంటున్నతన సోదరుడు చిలుక ఉపేందర్ రెడ్డికి తెలుపగా ఆయన సుమారు 7 ట్రేల అరటిపండ్లను యాదగిరిగుట్టకు పంపించాడు. దీంతో సీఐ జానకిరెడ్డి, పోలీస్ సిబ్బంది కలిసి పెట్రోలింగ్ వాహనంలో అరటి గెలలను తీసుకెళ్ళి వానరాలకు అందించారు.ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ.. మూగ జీవుల ఆకలిని తీర్చడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు, అదే విధంగా మూగజీవాలకు దాతలు తమకు తోచిన సాయాన్ని అందించాలని సీఐ జానకిరెడ్డి విజ్ఞప్తి చేశారు. కాగా, యాదగిరి గుట్టలో ఖాకీలు కోతులకు అరటి పండ్లు తినిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed