- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాదాద్రి టెంపుల్ రెడీ!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి ప్రధానాలయం పనులు పూర్తయ్యాయి. ఫినిషింగ్ వర్క్ వారం రోజులలో కంప్లీట్ కానుంది. వసంత పంచమి లేదా రథసప్తమికి ఆలయాన్ని ప్రారంభించేందుకు దాదాపు అంతా సిద్ధమయ్యిందనే చెప్పాలి. ఈ నెలలోనే ఇందుకు ముహూర్తం ఖరారు కానుదని సమాచారం. ప్రధానాలయం మినహా మిగతా పనులు ఇంకా కొనసాగుతున్నందున దర్శనానికి వచ్చే భక్తులకు వసతులు, ఇతర సౌకర్యాలపరంగా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆ పనులు పూర్తయ్యేందుకు మరో మూడు నెలల సమయం పట్టనుంది. యాదాద్రి బ్రహ్మోత్సవాలను కొత్త ఆలయంలోనే నిర్వహించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం మీద ‘దిశ’ ప్రత్యేక కథనం.
దిశ ప్రతినిధి, నల్లగొండ/ ఆలేరు: యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా ప్రధానాలయం, ప్రసాద విక్రయశాల, భక్తులకు వసతి కాంప్లెక్స్, వీఐపీ స్యూట్స్, పుష్కరిణి, యాదాద్రి పైకి రహదారుల ఏర్పాటు పనులను చేపట్టారు. ప్రధానాలయంలో 90 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రసాద విక్రయశాల, క్యూకాంప్లెక్స్, భక్తులకు వసతి, పుష్కరిణి నిర్మాణాలు 70 శాతమే పూర్తయ్యాయి. ఇవి పూర్తి కావాలంటే కనీసం మరో మూడు నెలల సమయం పట్టనుంది. వాస్తవానికి ఆలయాన్ని గతేడాది బ్రహ్మోత్సవాల వరకు సిద్ధం చేయాలని భావించినా సాధ్యపడలేదు. ఈసారి నిర్వహించే బ్రహ్మోత్సవాలకైనా ఆలయాన్ని ప్రారంభించాలనే తలంపుతో సీఎం కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. పనులు అప్పటి వరకు పూర్తికావని తేలడంతో ముందుగా ప్రధానాలయాన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మిగతా పనులు పూర్తికాకపోయినా ఆలయాన్ని ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. యాదాద్రి పునర్నిర్మాణంలో ప్రధానాలయయే కీలకం. బ్రహ్మోత్సవాలు మార్చి నెలలో ఉండడంతో ఆ సమయం వరకు యాదాద్రిని ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కొండపైన ప్రధానాలయం, ప్రసాద విక్రయశాల, క్యూలైన్ల నిర్మాణం, శివాలయం, పుష్కరిణి, ఈఓ కార్యాలయం వంటి నిర్మాణాలు చేపట్టేందుకు నిర్ణయించారు. మరికొద్ది రోజులలో క్యూలైన్లతో పాటు ప్రధానాలయంలో ఫినిషింగ్ వర్క్ పూర్తయ్యే అవకాశం ఉంది. మరో సరికొత్త డిజైన్‌ను రాజస్థాన్ వర్కర్లు చేస్తున్నారు.
దర్శనమొక్కటే పైన.. మిగతావన్నీ కిందే..
కొండపైన భక్తులకు కేవలం దర్శనం చేసుకుని ప్రసాదాలు తీసుకునే వెసులుబాటే ఉంటుంది. యాదాద్రికి వచ్చే భక్తులకు అవసరమయ్యే వసతి సౌకర్యం, కల్యాణ కట్ట, వ్రతాలు, పుణ్య స్నానాలు ప్రధానంగా భావిస్తారు. భక్తులు దర్శనానికి మాత్రమే కొండపైకి వెళ్లాల్సి ఉంది. పుణ్యసాన్నాల కోసం కొండ కింద లక్ష్మి పుష్కరిణిని ఏర్పాటు చేయగా, వ్రతాల కోసం పాతగుట్ట సమీపంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక వసతి సౌకర్యం అంతా తులసీ కాటేజీకి పరిమితం అయ్యింది. తులసీ కాటేజీలో నిర్మించే నారసింహా సదనం, అండాల్ సదనాన్ని ఇప్పటికే నిర్మించారు. కొత్తగా మరో సదనాన్ని నిర్మిస్తున్నారు. అయితే దీనికి ప్రహ్లాద సదనంగా నామకరణం చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. అయితే ఇవన్నీ బ్రహ్మోత్సవాల సమయానికి పూర్తయ్యే అవకాశం లేదు.
సీఎంకు వైటీడీఏ నివేదిక
బ్రహ్మోత్సవాల సమయానికి యాదాద్రి ఆలయం ప్రారంభం సాధ్యాసాధ్యాలపై వైటీడీఏ ఇప్పటికే నివేదికను అందించింది. సీఎంఓ కార్యదర్శి భూపాల్‌రెడ్డి సైతం పలుమార్లు నిర్మాణ పనులను పరిశీలించి సీఎం కేసీఆర్‌కు పరిస్థితిని వివరించారు. మిగతా పనుల సంగతి ఏలా ఉన్నా ప్రధానాలయం పనులు పూర్తి చేయాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. మిగతా పనులు పూర్తికాకుండా ఆలయమొక్కటే ప్రారంభిస్తే ఎలా ఉంటుందో అనే దానిపై కొంత సందిగ్ధంలో పడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు సీఎం కేసీఆర్ త్వరలోనే యాదాద్రి పనులను పరిశీలించనున్నారు. అక్కడి పరిస్థితులను చినజీయర్ స్వామికి వివరించి యాదాద్రి ఆలయాన్ని ప్రారంభించాలా వద్దా అనే అభిప్రాయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.