- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అధికారులకు వణుకు పుట్టిస్తున్న యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి
దిశ, వెబ్‌డెస్క్ : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విధుల్లో తన మార్క్ చూపిస్తున్నారు. విధుల్లో అలసత్వం వహిస్తున్న అధికారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. హద్దులు దాటి ప్రవర్తిస్తున్న అధికారులు, పైరవీలు చేస్తున్న వారిపై సీరియస్‌గా ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా విధుల్లో అలసత్వం వహిస్తున్నారన్న కారణంగా జిల్లా ప్రజా సంబంధాల అధికారిణి (డీపీఆర్ఓ) పద్మను సమాచార శాఖ(ఐ అండ్ పీఆర్)కు అలాట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు అనితా రామచంద్రన్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. ఆమెను వారం రోజుల క్రితం బదిలీ చేసి వరంగల్ నగర పాలక సంస్థలో ఉన్న పమేలా సత్పతిని నియమించారు. కలెక్టర్‌గా ఛార్జ్ తీసుకున్న వారం రోజులు నుంచి జిల్లా అధికారుల పని తీరుపై ఫోకస్ పెట్టిన పమేలా సత్పతి.. విధుల్లో ఎవరు అలసత్వం వహిస్తున్నారు..? పైరవీలు ఎవరు చేస్తున్నారు..? విధులకు రాకుండా ఎవరు తిరుగుతున్నారు..? ఇలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే డీపీఆర్ఓపై వేటు పడినట్లు సమాచారం. ఈ ఝలక్‌తో జిల్లా అధికారుల వెన్నుల్లో వణుకు ప్రారంభమైంది. ఎప్పుడు ఏ అధికారిపై వేటు పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేసే అధికారులు సైతం సెట్ రైట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఖచ్చితంగా డ్యూటీ టైంకు ఆఫీస్ కి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనా కలెక్టర్‌గా పమేలా సత్పతి ఛార్జ్ తీసుకున్న నాటి నుంచి జిల్లా అధికారుల్లో భయం మొదలైనట్లు కింది స్థాయి అధికారులు పేర్కొనడం గమనార్హం.