- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతి తీవ్ర తుపానుగా మారిన యాస్
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుపాను ఒడిశా, పశ్చిమ బెంగాల్‌వైపు వేగంగా ప్రయాణిస్తూ మంగళవారం సాయంత్రం అతితీవ్ర తుపానుగా పరిణమించింది. నేటి ఉదయం ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలకు చేరువకానుంది. మధ్యాహ్నానికి ముందు నుంచే తీరప్రాంతాల్లో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు సహా భారీ వర్షం కురువనుంది. అలలు రెండు నుంచి మూడు మీటర్ల ఎత్తుకు ఎగసిపడనున్నాయి. తొలుత ఒడిశాలోని ఉత్తర ధమ్రా, దక్షిణ బాలాసోర్‌లో భారీ వర్షాలు పడనున్నట్టు అంచనాలున్నాయి. ఈ రెండు రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులపై తుపాన్ ప్రభావం పడనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం ఉదయం ఒడిశాకు చెందిన పారాదీప్ దీవులు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన సాగర్ దీవుల గుండా ఈ రెండు రాష్ట్రాల తీరాలను తుపాను తాకనుంది.
భీకర వర్షానికి ముందు అతివేగంతో వీచే గాలులూ వణికించనున్నాయి. మంగళవారం సాయంత్రమే వేగంగా వీచే గాలులతో పశ్చిమ బెంగాల్ నార్త్ 24 పరగణాల జిల్లాల్లో చెట్లు కూలిపోగా, కొన్ని ఇళ్లు డ్యామేజ్ అయ్యాయి. దీంతో ఇరు రాష్ట్రాల తీర ప్రాంతాల్లో ప్రభుత్వాలు రెడ్ అలర్ట్ ప్రకటించాయి. తుపాను నష్టాన్ని తగ్గించుకోవడం, సహాయ చర్యలు సకాలంలో చేపట్టడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తుపాను ప్రభావిత రాష్ట్రాలతో చర్చలు జరిపారు. తుపాను పరిస్థితులను ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పర్యవేక్షిస్తుండగా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా మంగళవారం రాత్రంగా వార్ రూమ్‌లోనే ఉండి తుపాను పరిస్థితులను పర్యవేక్షించనున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు హై అలర్ట్‌గా ఉండాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. బిహార్, జార్ఖండ్ రాష్ట్రాలు తుపాను పట్ల అప్రమత్తంగా ఉన్నాయి.
అంఫన్ తుపాను స్థాయిలో యాస్ తుపాను బెంగాల్‌కు నష్టం కలిగించకపోవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ సహాయక చర్యలు, కరోనా ట్రీట్‌మెంట్, వ్యాక్సినేషన్‌పై ముందస్తు ప్రణాళికలతో ఈ రాష్ట్రాలు రక్షణ చర్యలు చేపట్టనున్నాయి. తొలిసారిగా, బెంగాల్, ఒడిశాలకోసం అత్యధిక స్థాయిలో 115 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాలుపంచుకోనున్నాయి. ఇప్పటికే ఒడిశా తీర ప్రాంతాల నుంచి కనీసం రెండు లక్షల మందిని, పశ్చిమ బెంగాల్‌లో కనీసం తొమ్మిది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే బెంగాల్, ఒడిశాల మీదుగా వెళ్లే ట్రైన్లు నిలిపేశారు. కోల్‌కతా నుంచి చెన్నై వేళ్లే జాతీయ రహదారులను అర్ధరాత్రి నుంచే మూసేశారు.