WWW టీజర్ విడుదల.. హ్యాపీగా ఉందన్న మహేష్ బాబు

by Shyam |
WWW టీజర్ విడుదల.. హ్యాపీగా ఉందన్న మహేష్ బాబు
X

దిశ, వెబ్‌డెస్క్: '118' వంటి సూప‌ర్‌హిట్ చిత్రాన్నితెర‌కెక్కించిన ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహన్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్నలేటెస్ట్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ‌'WWW'(ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు). అథిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై డా. ర‌వి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. మ‌క‌ర సంక్రాంతి పండ‌గ‌ సంద‌ర్భంగా 'WWW' మూవీ టీజ‌ర్‌ను సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా… సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు మాట్లాడుతూ ..“నాకు ఇష్ట‌మైన టెక్నీషియ‌న్స్‌లో కేవి గుహ‌న్ గారు ఒక‌రు. ఆయ‌న‌తో చాలా మంచి సినిమాల‌కు వ‌ర్క్‌ చేశాను. ఇప్పుడు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'WWW'టీజ‌ర్ రిలీజ్ చేయ‌డం హ్యాపీగా ఉంది. టీజ‌ర్ చూశాను చాలా బాగుంది సినిమా త‌ప్ప‌కుండా హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను. అన్నారు. ఈ నేపథ్యంలోనే టీమ్ అంద‌రికీ మహేశ్ బాబు విషెస్‌ చెప్పారు.

Advertisement

Next Story