- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూకే 'రెడ్ లిస్ట్'లో ఇండియా.. షెడ్యూల్ ప్రకారమే డబ్ల్యూటీసీ ఫైనల్
దిశ, స్పోర్ట్స్: ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకెండ్ వేవ్ తీవ్రతరం అవుతుండటంతో పలు దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. సెకెండ్ వేవ్ తీవ్రత ఇండియాలోనే అధికంగా ఉండటంతో యూకే, సింగపూర్ వంటి దేశాలు ‘రెడ్ లిస్ట్’లో పెట్టాయి. ఇండియా నుంచి బ్రిటన్ వాసులు వస్తే వారికి 10 రోజుల కఠిన క్వారంటైన్ విధిస్తున్నది. ఈ నేపథ్యంలో జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా జరగాల్సిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌పై నీలినీడలు కమ్మకున్నాయి. భారత జట్టు ఆ ఫైనల్ ఆడనుండటమే ఇందుకు కారణం.
కాగా, దీనిపై ఐసీసీ పూర్తి స్పష్టతను ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారమే ఫైనల్ మ్యాచ్ జరుగనున్నట్లు చెప్పింది. టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ విషయమై ఐసీసీతో ఇంగ్లాండ్ అండ్ వేల్ప్ క్రికెట్ బోర్డు అధికారులు సమావేశమయ్యారు. మ్యాచ్ నిర్వహణపై స్పష్టమైన ప్రణాళికను ఐసీసీకి అందజేశారు. అంతే కాకుండా ఇంగ్లాండ్ ప్రభుత్వంతో చర్చలు జరిపి భారత జట్టు యధావిధిగా బ్రిటన్ చేరుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఐసీసీ మ్యాచ్ కొనసాగుతుందని తేల్చి చెప్పింది. మరోవైపు జూన్‌లో పరిస్థితులను బట్టి అంతర్జాతీయ ప్రయాణాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి టీమ్ ఇండియాను పంపే విషయంపై అప్పటికి నిర్ణయిస్తామని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.