ఆ రెజ్లర్ రైల్వే ఉద్యోగం కూడా పోయినట్లేనా..!

by Shyam |
ఆ రెజ్లర్ రైల్వే ఉద్యోగం కూడా పోయినట్లేనా..!
X

దిశ, స్పోర్ట్స్: యువ రెజ్లర్ సాగర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుశీల్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హత్య కేసులో అరెస్టు అరెస్టు అయిన రెజ్లర్ సుశీల్ కుమార్‌ను నిబంధనల ప్రకారం ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. సుశీల్ కుమార్‌కు స్పోర్ట్స్ కేటగిరీలో రైల్వేలో ఉద్యోగం లభించింది. ఆయన ప్రస్తుతం అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడు కావడంతో అతడికి హాజరుతో పెద్దగా పని ఉండదు. అతడికి రైల్వే శాఖ నుంచి ప్రతీ నెల జీతంతో పాటు ఇతర అలవెన్సులు కూడా వస్తుంటాయి. దీంతో సుశీల్ కుమార్ శిక్షణ నిమిత్తం చత్రాసాల్‌లోనే గడుపుతుంటాడు. కాగా మే 4న చత్రాసాల్ స్టేడియంలో జరిగిన ఘర్షణలో యువ రెజ్లర్ హత్యలో ప్రధాన నిందితుడిగా సుశీల్ కుమార్ ఉండటంతో అతడిని సస్పెండ్ చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed