ఐపీఎల్‌పై ఆశలు లేవు

by  |
ఐపీఎల్‌పై ఆశలు లేవు
X

దిశ, స్పోర్ట్స్: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జరుగుతున్నదనే నమ్మకం రోజురోజుకూ సన్నగిల్లుతున్నదని పలువురు ఐపీఎల్ సీఈఓలు అభిప్రాయపడుతున్నారు. ‘ఇన్‌సైడ్ స్పోర్ట్’ అనే క్రీడా వెబ్‌సైట్‌తో మాట్లాడిన పలువురు సీఈఓలు ఐపీఎల్ 13వ సీజన్‌పై ఆశలు వదులుకుంటున్నట్లు చెప్పారు. ఐపీఎల్‌ జరుగుతుందనే నమ్మకం లేదని ఇప్పటికే ఆటగాళ్లు, స్పాన్సర్లు వ్యాఖ్యానిస్తున్నట్లు చెప్పారు. ‘ఇప్పటికీ ఐపీఎల్‌ నిర్వహణపై తమకు స్పష్టత లేదు. చాలా మంది విదేశీ క్రికెటర్లు రోజు మాకు మెసేజెస్ చేస్తున్నారు. ఐపీఎల్‌పై ఏదో విషయం చెప్పమని ఒత్తిడి చేస్తున్నారు. కానీ, మా దగ్గర మాత్రం ఎలాంటి సమాధానం లేదు. త్వరగా బీసీసీఐ ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది’ అని ఫ్రాంచైజీలు అంటున్నాయి. ఇప్పటికే స్టార్ స్పోర్ట్స్ కూడా కరోనా సమయంలో స్పాన్సర్లను వెతికి పట్టుకోవడం కష్టమవుతుందని, ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణపై ఇంకా సందిగ్ధం నెలకొన్నదని ఎండీ ఉదయ్ శంకర్ కూడా వ్యాఖ్యానించారు. మరోవైపు టీ20 వరల్డ్ కప్‌పై ఐసీసీ నిర్ణయం వెలువరించే వరకు ఐపీఎల్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని బీసీసీఐ స్పష్టం చేసింది.

Next Story

Most Viewed