- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మధ్యాహ్న భోజనంలో పురుగులు.. ఆందోళనలో విద్యార్థులు, పేరెంట్స్
దిశ, హసన్‌పర్తి : మండలంలోని సిద్దాపూర్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. కొందరు విద్యార్థులు వంట నిర్వాహకులకు పురుగులను చూపించగా వాటిని తీసేసి తినమన్నారని తెలిపారు. ఇదే విషయాన్ని విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్లి కన్నీరు పెట్టుకున్నారు. కుళ్లిపోయిన కూరగాయలతో కూర, నీళ్ల పప్పు చారు, సరిగ్గా ఉడకని అన్నంలో పురుగులు.. ఇదేనా మధ్యాహ్న భోజనం అంటూ విద్యార్థుల తల్లి దండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదరికం వల్లనే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వారు పడుతున్న కష్టాలు తమ పిల్లలకు రాకూడదన్న కారణంతోనే వారిని చదువుకోమని పంపిస్తున్నామని.. పూట గడవక కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దంటూ పేరెంట్స్ మండి పడ్డారు. ఈ విషయంపై మండల విద్యాధికారి రాంకిషన్ రాజు మాట్లాడుతూ.. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
- Tags
- mid day meals