- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతిపెద్ద డైనోసార్ అస్థిపంజరం.. వేలంలో 8 మిలియన్ డాలర్లు
దిశ, ఫీచర్స్ : బిగ్ జాన్‌గా పిలువబడే ప్రపంచంలోనే అతిపెద్ద ట్రైసెరాటాప్స్(మూడు కొమ్ముల డైనోసార్ అస్థిపంజరం).. పారిస్‌లో జరిగిన వేలంలో 7.7 మిలియన్ డాలర్లకు విక్రయించబడింది. అమెరికన్ ప్రైవేట్ కలెక్టర్ హామర్.. తాజాగా అక్షన్ హౌస్ ‘డ్రౌట్’ నిర్వహించిన వేలంలో బిడ్ వేశారు. 66 మిలియన్ సంవత్సరాల ఈ పురాతన ట్రైసెరాటాప్స్.. డైనోసార్ అస్థిపంజరానికి చెందినవి. దీనికి 5.5 మిలియన్ యూరోలు లభిస్తుందని అంచనా వేయగా.. భారీ సైజులో ఉండటంతో ఊహించిన ధర కంటే 1.2 నుంచి 1.5 మిలియన్ యూరోల వరకు పెరిగింది.
ట్రైసెరాటాప్స్ అంటే ఏమిటి ?
పుర్రె ఆకారంలో 2.62 మీ పొడవు, 2 మీ వెడల్పు గల ఈ ‘ఐకానిక్’ ట్రైసెరాటాప్స్ 2014లో కనుగొనబడ్డాయి. ఇవి సహచర జీవుల కన్నా కొంచెం భిన్నంగా ఉంటాయి. విశాలంగా, ఎముకలు, రక్షణాత్మక కాలర్‌తో పాటు మూడు పొడవైన కొమ్ములతో దీని శరీరం సహజ కవచంలా ఉంటుంది. అయితే 2015 నాటికి 60% అస్థిపంజరం ఎముకలను సేకరించిన ప్యారియోంటాలజిస్టులు తీవ్రంగా శ్రమించి పారిస్ వేలం కోసం ఈ అస్థిపంజరాన్ని 200 ముక్కలతో తయారుచేశారు. కాగా అమెరికాలోని దక్షిణ డకోటాలో కనుగొనబడిన ఈ ఆకారాన్ని సంరక్షించడంలో భాగం కావడం చాలా ప్రత్యేకమైందని కొనుగోలుదారు వెల్లడించాడు. ఇక డైనోసార్స్‌లో ట్రైసెరాటాప్స్ అత్యంత విలక్షణమైనవని తెలుస్తుండగా.. గతేడాది టైరాన్నోసారస్ రెక్స్ అస్థిపంజరాన్ని న్యూయార్క్‌లో 31.8 మిలియన్ డాలర్లకు అక్షన్ హౌస్ క్రిస్టీస్ విక్రయించింది.