- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచంలోనే తొలి 3డీ ప్రింటెడ్ బ్రిడ్జి ప్రారంభం
దిశ, ఫీచర్స్ : 3డీ ప్రింటింగ్‌తో ఎన్నో పరికరాలకు సరికొత్తగా ప్రాణం పోస్తున్న విషయం తెలిసిందే. ఈ సాంకేతికతో ఇప్పటికే ఇండ్ల నిర్మాణాలు కూడా జరిగాయి. ఐఐటీ మద్రాస్ ప్రాంగణంలో 600 చ. అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన తొలి త్రీడీ ప్రింటెడ్ గృహాన్ని ఇటీవలే ప్రారంభించారు. భవన నిర్మాణాల్లో త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ఫ్యూచర్‌లో కీలకపాత్ర పోషించనుండగా.. ప్రపంచంలోనే మొట్టమొదటి స్టెయిన్‌లెస్ స్టీల్ బ్రిడ్జిని నెదర్లాండ్స్‌లో నిర్మించారు. ఈ వంతెనను నాలుగు రోబోలు కలిసి రూపొందించడం మరో విశేషం.
నెదర్లాండ్‌కు చెందిన ‘జోరిస్ లార్మాన్ ల్యాబ్స్’తో కలిసి డచ్ రోబోటిక్స్ సంస్థ.. ఎంఎక్స్3డీ 12 మీటర్ల 3డీ-ప్రింటెడ్ పాదచారుల వంతెనను అమెస్టర్‌డామ్‌లోని అతి పురాతన కాలువపై నిర్మించింది. సుమారు ఆరేళ్ల కిందట మొదలైన ప్రాజెక్ట్ పనులు ఇటీవలే పూర్తవడంతో ఈ నెల 15న ప్రారంభించబడింది. రోబోటిక్ చేతుల ద్వారా ముద్రించిన ఈ బ్రిడ్జిని వినూత్న సెన్సార్ నెట్‌వర్క్‌తో అమర్చారు. దీనికి అనుసంధానించిన డిజిటల్ ట్విన్ కంప్యూటర్ మోడల్.. వంతెన పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తుంది. అంతేకాదు సేఫ్టీలో భాగంగా, అంతర్నిర్మిత సెన్సార్లు నిరంతరం స్ట్రెయిన్, డిస్‌ప్లేస్‌మెంట్, వైబ్రేషన్, ఎయిర్ క్వాలిటీ, టెంపరేచర్ వంటి అంశాల డేటాను సేకరిస్తాయి. ఈ డేటా ఆధారంగా వంతెన క్వాలిటీ చెక్ చేస్తుంటారు. వంతెనకు ఏమైనా ప్రమాదం వాటిల్లినా లేదా దెబ్బతిన్నా వెంటనే సెన్సార్ల ద్వారా సమాచారం అందుతుంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం కోసం దాదాపు 4,500 కిలోల ఉక్కును ఉపయోగించారు. కాగా రోబోలతో రూపొందిన ఈ బ్రిడ్జిని పడవ సాయంతో కాలువ వద్దకు తీసుకొచ్చి అమర్చారు.
ఈ తరహా వంతెన నిర్మించడం తొలిసారి కావడం వల్ల సదరు టెక్నాలజీకి సంబంధించిన మొత్తం డేటాను నిర్వాహకులు కంప్యూటర్‌లో భద్రపరిచారు. ప్రయోగాత్మకంగా నిర్మించిన ఈ బ్రిడ్జి.. భవిష్యత్తులో 3డీ టెక్నాలజీతో పెద్ద భవంతులు నిర్మించే కంపెనీలకు ఓ ఉదాహరణ నిలుస్తుందని దీని తయారీ సంస్థ ‘ఎంఎక్స్ 3డీ’ చెప్తోంది. తక్కువ ఖర్చుతో కూడిన మెటీరియల్స్ ఉపయోగించి సమర్థవంతమైన నిర్మాణాన్ని రూపొందించవచ్చని 3డీ-ప్రింటింగ్ టెక్నిక్ చూపించిందని మేకర్స్ టీమ్ పేర్కొంది. భవన నిర్మాణ రంగంలో వెయిట్ రిడక్షన్, మెటీరియల్స్ తగ్గడమే కాకుండా, క్వాలిటీ పెరుగుతుందని ఆ సంస్థ తెలిపింది.