ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా ఫెసిలిటీ సెంటర్.. ఎక్కడంటే..

by vinod kumar |

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దాన్ని ఎదుర్కొనే కార్యంలో రాష్ట్ర సర్కారు నిమగ్నమైంది. 22 ఫుట్‌బాల్ మైదానాల వైశాల్యంతో 10,000 బెడ్‌లతో కొవిడ్ 19 కేర్ ఫెసిలిటీని ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది.

దక్షిణ ఢిల్లీలోని రాధా సామి స్పిరిచ్యువల్ సెంటర్‌ను ఈ ఫెసిలిటీగా మారుస్తున్నది. మరొక సానుకూల విషయమేంటంటే ఇందులోని పడకలు కార్డ్‌బోర్డ్‌లతో తయారు చేసినవి. మెటల్, ప్లాస్టిక్‌లపై కరోనా దాదాపు ఐదు రోజులు జీవించే అవకాశమున్నది, కానీ, కార్డ్‌బోర్డ్‌ బెడ్‌లపై 24 గంటలకు మించి బతకలేదని చెబుతున్నారు.

కాగా, ఇందులో మ్యాన్ పవర్ కోసం పారా మిలిటరీ, మిలిటరీ బలగాలు రంగంలోకి దిగుతాయని ఈ వ్యవహారాన్ని అంతా పర్యవేక్షిస్తున్న దక్షిణ ఢిల్లీ జిల్లా మెజిస్ట్రేట్ బీఎం మిశ్రా తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed