డైలీ 10 నిమిషాలు ఇలా చేయండి.. మొద్దుబారిపోయిన మెదడు కూడా చురుగ్గా పనిచేయాల్సిందే?

by Anjali |   ( Updated:2024-10-27 10:15:42.0  )
డైలీ 10 నిమిషాలు ఇలా చేయండి.. మొద్దుబారిపోయిన మెదడు కూడా చురుగ్గా పనిచేయాల్సిందే?
X

దిశ, వెబ్‌డెస్క్: మానసిక ఆరోగ్యం(mental health) బాగుంటూనే బాడీ మొత్తం యాక్టివ్‌గా, ఎనర్జీగా ఉంటుంది. కాగా మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలంటున్నారు నిపుణులు. కాగా రోజూ బుక్స్(Books) చదవాలి. కంటికి సరిపడ నిద్ర(sleep) పోవాలి (7 నుంచి 8 గంటల వరకు), శారీరక శ్రమ(physical activity)లో నిమగ్రమవ్వడం లాంటి మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాగా మెదడు(brain) ఉల్లాసంగా ఉండాలంటే శారీరక ఆరోగ్యంపై కేర్ తీసుకోవాలి. మెదడు శరీరంలో అతి ముఖ్యమైన పార్ట్. ఇది 1400 గ్రాముల వెయిట్ ఉంటుంది. బాడీలో ఏ పార్ట్ వర్క్ చేయాలన్నా మెదడు అనుమతి తప్పక ఉండాల్సిందే. మెదడు ఎప్పుడూ వర్క్ చేస్తూనే ఉంది. కాగా అలాంటి మైండ్ కు పదును పెట్టడం ఎలా? జ్ఞాపకశక్తిని (memory)ఎలా పెంచుకోవాలో ఇప్పుడు చూద్దాం...

మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ నడవాలి. కేవలం పది నిమిషాలు నడిస్తే చాలు మీ డిప్రెషన్(depression), ఆందోళన(worry) స్థాయిలు తగ్గిపోతాయని తాజాగా నిపుణులు వెల్లడించారు. కొన్ని నెలల పాటు ప్రతిరోజూ నడిస్తే.. మెదడుకు మంచి అనుభూతిని కలిగించే న్యూరోకెమికల్స్(Neurochemicals) అందుతాయి. అంతేకాకుండా మెదడు ఆరోగ్యంతో పాటు వృద్ధి కారకాలు కూడా అభివృద్ధి అవుతాయి. 75 ఏళ్ల వరకు సోమరితనంలో ఉంటే.. తరచుగా వాకింగ్ చేయడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని తాజాగా యూనివర్సిటీ ఆఫ్ రోచెస్ మెడికల్ సెంటర్(University of Roches Medical Center) నివేదిక చెబుతుంది. అలాగే మెదడు స్ట్రాంగ్ గా మారుతుందని అంటున్నారు. కాగా ప్రతిరోజూ కేవలం 10 నిమిషాలు వాకింగ్ చేయండి. వాకింగ్ చేయడానికి వయసుతో సంబంధం లేదు. వాకింగ్ వల్ల మెమోరీ పవర్ పెరుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. రోజంతా యాక్టివ్ గా ఉంటుంది.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed