Yunus: బంగ్లాదేశ్‌లో కీలక సంస్కరణలు.. మహమ్మద్ యూనస్

by vinod kumar |
Yunus: బంగ్లాదేశ్‌లో కీలక సంస్కరణలు.. మహమ్మద్ యూనస్
X

దిశ, నేషనల్ బ్యూరో: సవాళ్లను క్రమంగా పరిష్కరిస్తానని ప్రజలు ఓపిక పట్టాలని బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ కోరారు. వివిధ రంగాల్లో కీలక సంస్కరణల తర్వాత స్వేచ్ఛా యుతమైన, న్యాయమైన ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఆదివారం ఆయన ఓ టెలివిజన్ చానెల్‌లో ప్రసంగించారు. తాత్కాలిక ప్రభుత్వం స్థానిక ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయడంతో పాటు, ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడానికి కృషి చేస్తుందని నొక్కి చెప్పారు. బాధ్యతాయుతమైన రాజకీయ వ్యవస్థను ప్రవేశపెట్టడమే తన లక్ష్యమని చెప్పారు. మధ్యంతర ప్రభుత్వ పదవీ కాలానికి ఎలాంటి గడువు ఇవ్వలేదని, కానీ ప్రభుత్వం ఎప్పుడు నిష్క్రమిస్తుందో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఉన్నారన్నారు.

తన ప్రభుత్వాన్ని అన్ని వర్గాల ప్రజలు స్వాగతించినందున తనకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించడానికి ప్రయత్నిస్తానన్నారు. గత ప్రభుత్వాలు దేశంలోని అన్ని సంస్థలను నాశనం చేశారని విమర్శించారు. సంస్థలపై దాడి చేయడం, నిర్దిష్ట వ్యక్తులను బెదిరించడం, కేసులు స్వీకరించేలా ఒత్తిడి తీసుకురావడం, కోర్టు ఆవరణలో ప్రజలపై దాడులు చేయడం ద్వారా ముందస్తుగా విచారణ జరిపించే ధోరణిని ప్రజలు మానుకోవాలని సూచించారు. అనేక సవాళ్లను రాత్రికి రాత్రే పరిష్కరించలేమని స్పష్టం చేశారు. ఒక క్రమ పద్దతిలో అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed