వాట్సప్‌లో మైనర్ సె**క్స్ వీడియోలు ఫార్వర్డ్

by Kalyani |   ( Updated:2025-04-04 11:04:12.0  )
వాట్సప్‌లో మైనర్ సె**క్స్ వీడియోలు ఫార్వర్డ్
X

దిశ,దుబ్బాక : మైనర్ సె**క్స్ వీడియోను ఫార్వర్డ్ చేసిన యువకుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించినట్లు దుబ్బాక సీఐ శ్రీనివాస్ తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిరుదొడ్డి మండలం లక్ష్మీ నగర్ గ్రామానికి చెందిన పుట్ట అనిల్ ( 22 ) గత కొన్ని రోజుల క్రితం తన ఫోన్ ద్వారా మైనర్ సె**క్స్ వీడియోలు చూస్తూ అసహజ లైంగిక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ మేరకు సైబర్ సెక్యూరిటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. అతని మొబైల్ ఫోన్ సిమ్ కార్డు తో పాటు డివిడి స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించామన్నారు. ఈ సందర్భంగా దుబ్బాక సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ… సోషల్ మీడియాలో చట్ట విరుద్ధమైన పోస్ట్ చేసే వారిపై నిఘా ఉండడం జరిగిందని అలాంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Next Story

Most Viewed