- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సోనమ్ కపూర్ చేతిలో క్రిస్టియన్ హ్యాండ్‌బ్యాగ్.. దాని ధర ఎంతో తెలిస్తే షాక్?

దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్(Sonam Kapoor), నటుడు, నిర్మాత అనిల్ కపూర్(Anil Kapoor) కూతురిగా ఇండస్ట్రీకి వచ్చింది. ‘సావారియా’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ స్టార్ హీరోయిన్ అంత పాపులారిటీ సంపాదించుకోలేకపోయింది. కానీ బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్(Akshay Kumar), సల్మాన్ ఖాన్(Salman Khan) వంటి వారితో నటించి తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉండగానే సోనమ్ కపూర్ పెళ్లి చేసుకుని సినిమా ఇండస్ట్రీకి దూరం అయింది.
సోనమ్ చివరిగా నటించిన మూవీ ‘బ్లైండ్’. అయితే ఈ అమ్మడుకి ఓ బాబు కూడా ఉన్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతోంది. తన కొడుకుతో పలు పిక్స్ దిగి వాటిని నెట్టింట షేర్ చేస్తోంది. అలాగే పలు సంఘటనలపై తనదైన స్టైల్లో రియాక్ట్ అవుతూ వార్తల్లో నిలుస్తోంది. అలాగే పలు ఈవెంట్స్‌కు హాజరవుతూ సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, సోనమ్ కపూర్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో ఆమె పట్టుకున్న క్రిస్టియన్ హ్యాండ్‌బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. అయితే దాని ధర ఏకంగా రూ.3.9 లక్షలు అని సమాచారం. ప్రస్తుతం సోనమ్ కపూర్ బ్యా్గ్ ధర హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు.