Robots: ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే! కన్ను కొడుతున్న హ్యూమనాయిడ్ రోబో!!

by Ramesh N |
Robots: ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే! కన్ను కొడుతున్న హ్యూమనాయిడ్ రోబో!!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రోజు రోజుకు పెరుగుతోంది. రోజు రోజుకి కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. అందులో భాగంగా చైనా, జపాన్, అమెరికా వంటి దేశాల్లో రోబోల వాడకం పెరుగుతుంది. ప్రపంచ దిగ్గజ శాస్త్రవేత్తలు హ్యూమనాయిడ్ రోబోలను తీసుకొస్తూ అందరినీ అశ్చర్యానికి గురి చేస్తున్నారు. అచ్చం అమ్మాయిల మాదిరి డిజైన్ చేసిన హ్యూమనాయిడ్ రోబోలను చైనా, జపాన్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమ్మాయి రూపంలో తయారు చేసిన ఓ రోబో కన్ను కొట్టడం తాజాగా నెట్టింట వీడియో వైరల్‌గా మారింది. రియల్‌బోటిక్స్ సంస్థ ఆధ్వర్యంలో క్రియేట్ చేసిన ఈ ఏఐ బేస్‌డ్ హ్యూమనాయిడ్ రోబోకు నెటిజన్లు ఫిదా అయ్యారు.

వీడియోలో ఉన్న ప్రకారం.. ఆ రోబోకు అందమైన అమ్మాయి ఆకృతిని ఇచ్చారు. కన్ను రెప్పులు మనిషి మాదిరి కొట్టడం, మనిషిలానే చూపులు చూడటం చేస్తోంది. స్మైల్ ఫేస్, లోపలి కను గుడ్లు సైతం అటు ఇటు తిప్పడం చేస్తోంది. తర్వాత శాస్త్రవేత్త వచ్చి రోబో గురించి వివరించి.. రోబో డిజైన్‌ను తీసి చూపించి మళ్లీ బిగించడం చేస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఇది చూడటానికి రియల్‌ అమ్మాయిలాగే ఉందని కామెంట్స్ పెడుతున్నారు. ఇక, ఈ రోబో చూసిన ప్రతి ఒక్కరు ‘ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే’ అనే తెలుగు ఫేమస్ పాట పాడు కోవాల్సిందే.

Next Story

Most Viewed