సన్నబియ్యంతో లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

by Ramesh Goud |   ( Updated:2025-04-04 10:29:17.0  )
సన్నబియ్యంతో లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) పేదవారికి లబ్ది చేకూరే విధంగా ఉగాది పర్వదినం సందర్భంగా గత నెల 30న సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ నెల 1 నుంచి ప్రభుత్వం రేషన్ షాపుల (Ration Shops) ద్వారా పేదవాళ్లకు సన్నబియ్యం అందిస్తోంది. ఈ పథకం ద్వారా సన్నబియ్యం పంపిణీ సక్రమంగా జరుగుతుందా లేదా? సన్న బియ్యం నాణ్యత ఎలా ఉంది అని కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రజా ప్రతినిధులు ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Nakirekal MLA Vemula Veeresham) ఓ తెల్లరేషన్ కార్డు (White Ration Card) లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేశారు. నకిరేకల్ పట్టణంలోని వల్లాల సైదులు లక్ష్మమ్మ దంపతులకు గురువారం సన్న బియ్యం పథకం ద్వారా 24 కిలోల బియ్యం వచ్చాయి.

ఆ అభిమానంతో వారు నకిరేకల్ ఎమ్మెల్యేని శుక్రవారం తమ ఇంటికి పిలిచి ప్రభుత్వం అందించిన సన్న బియ్యంతో భోజనం పెట్టారు. ఈ సందర్భంగా సన్నబియ్యం చాలా నాణ్యంగా ఉన్నాయని ఎమ్మెల్యే అన్నారు. స్వయంగా ఎమ్మెల్యే సామాన్యులమైన తమ ఇంటికి భోజనానికి రావటం చాలా సంతోషంగా ఉందని ఆ కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే సన్నబియ్యం రావడం వలన మా కుటుంబానికి నెలకు 1000 రూపాల వరకు మిగులుబాటు ఉంటుందని వారు తెలిపారు. ఇక పేదవారికి సన్న బియ్యం వరం లాంటిదని ఎమ్మెల్యే వీరేశం వాఖ్యానించారు. ఈ సందర్బంగా ఆ కుటుంబానికి ఇల్లు కూడా సరిగలేదని గమణించిన ఎమ్మెల్యే.. నియోజకవర్గంలో మొట్టమొదటి ఇందిరమ్మ ఇళ్లు (Indiramma House)ను లక్ష్మమ్మ కుటుంబానికి మంజూరు చేస్తామని హామీ వీరేశం ఇచ్చారు.

Next Story

Most Viewed