బంగ్లాదేశ్ ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన యూనస్

by M.Rajitha |
బంగ్లాదేశ్ ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన యూనస్
X

దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్ లో ఏర్పడ్డ సంక్షోభం నేపథ్యంలో బంగ్లా తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ కీలక ప్రకటన చేశారు. గత కొద్దిరోజులుగా బంగ్లాదేశ్ లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి అన్నారు. అయినప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. ఈ సమస్యలు పూర్తిగా పరిష్కరించాక, దేశంలో కొన్ని సంస్కరణలు తీసుకు రానున్నట్టు యూనస్ ప్రకటించారు. దేశంలో శాంతియుత పరిస్థితులు ఏర్పాడ్డాక, నిష్పాక్షిక ఎన్నికలకు వెళ్తామని బుధవారం మహమ్మద్ యూనస్ ప్రెస్ సెక్రెటరీ మీడియాకు వివరించారు. అయితే ఇప్పటికీ బంగ్లాదేశ్ లో అల్లర్లు కొనసాగుతున్నట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తోంది. కాగా దేశంలోని విద్యాసంస్థలు అన్నీ గత రెండు రోజుల కింద తిరిగి తెరుచుకున్నప్పటికీ, పూర్తి స్టయిలో నడవడం లేదు. ఇక బంగ్లాలో జరగాల్సిన మహిళల టీ20 ప్రపంచ కప్ ఆ దేశంలోని అస్థిర పరిస్థితుల వల్ల యూఏఈకి తరలిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed